ప్లాస్టిక్ నది గురించి విన్నారా ?

ఇంత వరకు నదులు అంటే మనకి నీటిని ఇచ్చే జీవనధారులు అని మాత్రమే విన్నాము, చూసాము. వాటి గొప్పతనము గురించి ఎందరో కవులు పాటలు పద్యాలూ రాసారు, అవి చిన్నప్పటి నుంచి చదువుకున్నాము. నదులు ఎండిపోవటంతో ఎంత మంది ఇబ్బంది పడుతున్నారో, ఎన్ని పంటలు మాడిపోయాయో న్యూస్ పేపర్లో చదివాము, టి.వి.లో చూసాము.

కానీ ఎంత మందికి తెలుసు, మన భారతదేశము లో  ఒక్క నది మొత్తము ప్లాస్టిక్ తో నిండి పోయింది అని. ఈ వారము హిమాచల్ ప్రదేశ్ లో కురిసిన వర్షాలకి అశ్విని కాడ్ నది మొత్తము ప్లాస్టిక్ తో నిండి పోయింది. “హీలింగ్ హిమాలయాస్” అనే NGO తీసిన ఈ వీడియో చూడండి మీకే అర్ధము అవుతుంది.

కొంచెము అలసటగా అనిపించినా, మనకి బ్రేక్ కావాలి అన్నా మనము హిల్ స్టేషన్స్ కి పారిపోతాము లేకపోతే మన సమాజానికి జీవనధారులు అయినా నదుల దగ్గరకో, సముద్రము దగ్గరకో పారిపోటము మనకి ఉన్న అలవాటే కదా. మరి సెలవలకి ఎక్కడికి అన్నా వెళ్తేనే కదా మనకి విశ్రాంతి అని అంటారు. అది నిజమే.  మన ముందు తరము వరకు విశ్రాంతి, వెకేషన్ అని ఎవరు విని ఉండలేదు, ఎవ్వరు వెళ్ళలేదు.  వాళ్ళు ఇల్లు, ఊరు కదిలి వెళ్లారు అంటే అది తీర్థ యాత్రలకి మాత్రమే. కానీ మన తరము వచ్చేటప్పటికి, మనకి విశ్రాంతి, వెకేషన్ అవసరము అయ్యాయి.  దీని కారణము ఏమిటి అని ఎప్పుడు అన్న ఆలోచించారా?  ఈ ప్రశ్నకి వెంటనే వచ్చే జవాబు, ఉద్యోగములో ఉండే స్ట్రెస్,  ఊరిలో ఉండే పొల్యూషన్, అసలు మనకి అంటూ టైం లేక పోవటం అంటారు.  స్ట్రెస్, టైం గురించి ఈ బ్లాగ్ మాట్లాడటం లేదు. మనము పొల్యూషన్ గురించి మాత్రమే ఇక్కడ మాట్లాడుకుందాము.

https://www.youtube.com/watch?v=eyb_wDVsELU

ఈ ప్లాస్టిక్ నదికి, మన ఊరిలో ఉండే పొల్యూషన్ కి మనము కారణము కాదు అని ఎవరు అన్న చెప్పగలరా? మన ఇల్లు శుభ్రముగా ఉంటే చాలు, బయట ఎలా ఉన్న అనే మన స్వభావము మారనంతవరకు పైన వేసిన ప్రశ్నకి  ఎవ్వరు జవాబు చెప్పలేరు. కారులో/ట్రైన్లో వెళ్తూ, తాగిన నీళ్ల బాటిల్ ని చాల సులువుగా బయటకి విసిరేస్తాము,  తిన్న చాక్లేట్ రాపెర్ని బయట పడేస్తాము. ఇలా ఇంకా ఎన్నో ఎన్నెనో. ట్రైన్ ట్రాక్ పక్కన చూడండి, హైవే పక్కన చూడండి అంత ప్లాస్టిక్ మయము. చదువుకున్న మనము ఇలా ప్రవ్తరిస్తుంటే, మన కంటే తక్కువ చదువుకున్న వాళ్ళు మన వెనకాతల శుభ్రపరుస్తున్నారు. అది మన దేశ పరిస్థితి. అందుకే స్వచ్ఛ భారత్ అంటూ, మన ప్రధాన మంత్రిగారు ఒక్క పధకం ప్రవేశపెట్టాలిసి వచ్చింది. కానీ ఏమి లాభము, మన స్వభావాలు అంత తొందరగా మారావుగా అందుకే, ఆ పధకం కూడా ఎక్కడ వేసిన గొంగళిలాగా అక్కడే ఆగి పోయింది.

మన చెత్త బయట పడేయటం అనే మన అలవాటు ఎక్కడి వెళ్లినా మార్చుకోము కదా. అందుకే ఏ పాపమూ ఎరుగని, కొండలు, నదులు కూడా ఈ ప్లాస్టిక్ పొల్యూషన్ బారిన పడుతున్నాయి. ప్రపంచములోకే ఎంతో  ఎత్తుగా ఉండి, దేవులు నడిచే చోటు అయినా హిమాలయలోకి ఈ ప్లాస్టిక్ జొరపడింది అంటే మనము ఎంతగా ఈ భూమిని బాధిస్తున్నామో ఒక్కసారి ఆలోచించండి. ప్రపంచములోని నదులు అన్నిటిలోను ప్లాస్టిక్ వర్ద్యాలు ఉన్నాయి. కాకపొతే సముద్రాలలోకి వెళ్లే ప్లాస్టిక్ మొత్తము ఒక్క పది నదులనిచ్చి వస్తుంది అన్న ఈ కింద నివేదిక చూడండి.  వాటిలో మన భారతదేశములో అతి పెద్ద నది అయినా గంగ కూడా ఒక్కటి. రెండోది ఇండస్ నది. ఈ రెండు నదుల క్లీనప్ అంటూ మన ప్రభుత్వాలు ఎంత ఎంత ఖర్చు పెట్తున్నాయో అందరికి ఎరుకే.  అది ఎవరి డబ్బు చెప్పండి, మనము రాత్రి పగలు లేకుండా, తిని తినకుండా కష్టపడి సంపాదించినా డబ్బుతో టాక్స్ కట్టుతూ ఉంటే, ఆ డబ్బుని మన ప్రభుత్వాలు ఇలా నీళ్ల పాళ్ళు చెయ్యటం ఎంత వరకు సమంజసము చెప్పండి. దాని బదులు మనమే కొంత బాధ్యతగా ఉంది, ప్లాస్టిక్ వాడకం తగ్గించుకుని, ఆ ప్లాస్టిక్ ని బయట విసిరకుండా రీసైకిలింగ్కు ఇస్తూ ఉంటే, వాటి ని వాడి మనకి రోడ్డ్లు వేస్తారు, మన నదులు కూడా కొంచెము అయినా స్వచ్ఛముగా  ఉంటాయి కదా.

https://www.dw.com/en/almost-all-plastic-in-the-ocean-comes-from-just-10-rivers/a-41581484

ఏమి అంటారు, ఇప్పటికి అయినా, మనము కొద్దిగా మారుద్దామా? మన ముందు తరాలకి కొంచెము అయినా పరిశుభ్రము అయినా గాలిని, నీటిని ఇద్దామా?  మార్పు అన్నది ముందు మన ఇంటిలో మొదలు అవ్వాలి, అది మనతోనే మొదలు అవ్వాలి. అది ముందు తల్లి స్థానములో ఉన్న మనతోనే మొదలు అయ్యినప్పుడే,  మిగతా కుటుంబ సభ్యులు అందరు పాటించేది. తల్లులుగా ఇదే మన మొదటి కర్తవ్యము అని నేను అంటే, మీరు ఏమి అంటారు చెప్పండి. మీ ఆభిప్రాయాలిని క్రింద కామెంట్స్ గా పెట్టండి ప్లీజ్.

Author’s Note: This article was originally published in Momspresso

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s