ఆకాశమే నీ హద్దుగా సాగిపో మున్ముందుకి…

మగువలు నేర్వగరాని విద్య కలదే, ముద్దరా నేర్పినా  అన్న నానుడి పాతకాలముదే అయినా, ఈ రోజులకి కూడా సరిపోతుంది అని నిరూపించింది మేరీ కోమ్ తాను మొన్న సాధించిన విజయముతో. ప్రపంచ బాక్సింగ్ పోటీలలో 6వ సారి కూడా విజయము సాధించిన మొట్ట మొదట్టి మహిళగా చరిత్ర తిరగ రాసింది. ప్రపంచము అంతా తనని ప్రశంసలతో ముంచేస్తుంది.

https://cdn3.mycity4kids.com/images/article-images/web/headersV2/img-20180411-5acdf6857d886.jpg

కానీ, తాను మట్టుకు నిజమయిన సైనికుడిలాగా తన తుదుపరి లక్ష్యం వైపే తన దృష్టి  కేంద్రీకరించింది. అది ఏమిటి అనుకుంటున్నారా? అదే మరి, తల్లిగా తన బాధ్యతలు,  ఒలింపిక్స్లో గోల్డ్ మెడలు, కామన్వెల్త్ గేమేస్లు మెడలు. అందరికి కృతఙ్ఞతలు చెప్తూ తాను ట్వీట్ చేసిన సందేశము అదే మరి.

మేరీ కోమ్ జీవితము గురించి, తాను సాధించిన మెడల్స్ గురించి ఎందరో ఎన్నో కధలు, వ్యాసాలు రాసారు, ఒక్క సినిమానే కూడా తీశారు. ఇంతగా, తన గురించి అందరికి తెలిసిన తన గురించి నేను కొత్తగా చెప్పేది ఏమిటి అనుకుంటున్నారా? కొత్తగా ఏమి లేదు అండి, నా ఈ చిన్న బుర్రకి తట్టిన, తన జీవితము నుంచి నేను నేర్చుకోవాలి అనుకున్న ఈ  నాలుగు పాఠాలు మీతో పంచుకోవాలి అని వచ్చాను.

  • మనకి కావల్సినది అది, చదువే అయినా, ఆటయే అయినా అది సాధించటానికి ఏ అడ్డంకి మనకి ఎదురు కాదు. మన గమ్యము చేరటానికి ఎదో ఒక్క దారి దొరక్కపోదు. ఆ దారిలో వెళ్లే తెగింపు మనకి ఉండాలి అంతే.  ఆడ పిల్ల అయినా, మొగ పిల్లవాడు అయినా ప్రతి ఒక్కరికి జీవితములో ఒక్క గమ్యము ఉండాలి, దానిని సాధించటానికి పడే కష్టము ప్రతి ఒక్కరు అనుభవిస్తే కానీ, గెలుపులోని  సంతోషము అనుభవించలేము.
  • పెళ్లి మన జీవితపు గమ్యము చేరటానికి ఒక్క అడ్డంకి కాకూడదు. జీవితపు భాగస్వామి తోడ్పాటు ఉంటే మనము ఎంత పెద్ద గమ్యము అయినా చాల సులువుగా చేరుకోవచ్చు. ఒక్క వేళా, జీవితపు భాగస్వామి తోడ్పాటు లేకపోతే కూడా, మనము మన గమ్యము వైపు అడుగులు వేస్తూనే ఉండాలి. అవి ఎంత చిన్నవి అయినా సరే. అడుగులు ముందుకి వేయటం చాలా ముఖ్యము.
  •  తల్లిగా మారటంతోనే మన కెరీర్ ఆగిపోవాల్సిన పని లేదు. తల్లిగా మన కర్తవ్యము నిర్వర్తిసునే, మన ఆశయ సాధన చేయవచ్చు. కొంత కాలము, పిల్లలు చిన్న వాళ్ళుగా ఉన్నపుడు ఇంటి పట్టున ఉన్నా కూడా, ఆ ఆశయాగ్ని మన హృదయములో తగ్గనంత  వరకు, మనము ఎప్పుడు తిరిగి మొదలు పెట్టిన మన గమ్యము చేరుకోవచ్చు.
  • క్రీడాకారులు, సైనికుల నుంచి మనము నేర్చుకోవాలిసిన ఇంకో విషయము దేశప్రేమా.  మనకి లాగా, వాళ్ళు ఏ రోజు, ఈ దేశము మాకు ఏమి ఇచ్చింది అని అడగరు, మేము ఇంకా ఈ దేశానికీ ఏమి ఇవ్వగలం అనే ఆలోచిస్తారు.  మనలోని ప్రతి ఒక్కరు ఆలా ఆలోచించిన రోజు, తప్పకుండా మన జీవితాలని మనమే తీర్చిదిదుకోగలము. మనకి ఇంకా ఎవ్వరి సహాయము అక్కరలేదు.

ఈ నాలుగు విషయాలు మీ పిల్లలకి కూడా నేర్పించండి, వాళ్ళ జీవితములో వారే అత్యున్నత స్థానాలకు వెళ్లగలుతారు, ఇంకా వేరే ఎవ్వరి సహాయము అవసరము లేకుండా.

 

This blog is originally published in Momspresso. Please click this link to view my other Momspresso blogs

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s