ఇదే నా మన సంస్కృతీ?

గత పది రోజులుగా వార్తలలోనో, సోషల్ మీడియాలోను ఎక్కువుగా వినిపిస్తున్న పేరు హిమ దాసుది. మొట్ట మొదట్టి సరిగా పరుగు పందెములో అంతర్జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ గెలుచుకు రావటము అంటే మాటలు కాదు. ఆ విజయాన్ని కైవసము చేసుకున్నది హిమ దాస్ అనే పదునెమిది సంవత్సరాల చిన్న పిల్ల అంటే నమ్మటం చాల కష్టము. అందులోను ఇంత వరకు ఎక్కడ ఎక్కువగా వినిపించని పేరు కావటంతో అందరిలోను కుతూహలము రేకెత్తటం సహజమే. పి.టి. ఉష, అశ్విని నాచప్పల తరువాత ఇంత వరకు పరుగు పందెములు గురించి ఇంత వరకు ఎవరు పట్టించుకోలేదు, ఎవరు ఆలోచించలేదు. అలాంటిది ఒక్కసారే హిమ దాస్ ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేయటము మొదలు పెట్టింది. తాను సాధించిన విజయము గురించి మోడీ, ప్రణబ్ ముఖర్జీ కూడా మాట్లాడటం దీనికి ఇంకొంచెము ఊపునిచ్చింది. అందులోను మెడలు తీసుకుంటున్నప్పుడు, ఆ తరువాత మన జాతీయ గీతము వాయిస్తున్నప్పుడు హిమ దాస్ కదిలి పోయి కన్నీళ్లు పెట్టటం చాల మందిని కదిలించింది కూడా.

ఇంతవరకు జరిగినవి  చాల సహజముగా జరిగినవే. ఆ తరువాతే మనలోని వెర్రి వెయ్యి తలలు వెయ్యటం మొదలు పెట్టింది. ఆ అమ్మాయి గురించి వివరాలకోసము గూగుల్ ని ఆశ్రయంచటం జరిగింది. అంత వరకు బాగానే ఉంది.  కానీ మన వాళ్ళు అక్కడే మనలోని పైత్యమును బయట పెట్టారు. ఎక్కువగా మనము వెతికింది హిమ దాస్ గురించిన వివరాలలో తన కులము, జాతి గురించే. ఆ అమ్మాయి సాధించిన విజయాలు, ఆ అమ్మాయి ఎంత కష్టపడితే ఈ స్థాయికి వచ్చింది మనకి అక్కరలేదు. మన పిల్లలకి తన గురించి, తను పడ్డ కష్టము గురించి, సాధించిన గెలుపు గురించి కానీ, తన సాధించాలి  అనుకున్న ఆశయాల  గురించి కానీ చెప్పాల్సిన అవసరము లేదు. ఎందుకంటే, వీటి అన్నిటికి అంటే మనకి ఆ అమ్మాయి కులము వివరాలు చాల ఎక్కువుగా అవసరము కదా.

ఇది మనలో ఎవరో ఒక్కరు వుబుసు పోకుండా చెప్పే కబురు కాదు. స్వయముగా గూగుల్ ప్రచురించిన నివేదిక. దీని గురించి అంతర్జాతీయ మీడియా కూడా మాట్లాడింది మొన్న శుక్రవారం నాడు. ట్విట్టర్లో కూడా దీని గురించి చాల పెద్ద చర్చే జరిగింది. ఇదే నా మన ప్రగతి. ఇదే నా మన సంస్కృతీ?

ఇది చాలదు అన్నట్లు మన అథ్లెటిక్స్ ఫెడరేషన్ కూడా ఆ అమ్మాయి మీద రాళ్లు రువ్వటానికి ప్రయతించింది.  తనకి ఇంగ్లీష్ రాకపోవటం తన అతి పెద్ద నేరము అంటూ మాట్లాడింది.  దానిలోకి ఇంక మన అతి గొప్ప పొలిటిషన్స్ కూడా చేరి పోయి, అథెలిటిక్స్ ఫెడరేషన్ మాట్లాడినదానికి మన యూత్ స్పోర్ట్స్ మినిస్టర్ సమాధానము చెప్పాలి అని పట్టు పట్టటం మరి విడ్డురము. కాకపోతే, గుడ్డిలో మెల్ల లాగా మన సెంట్రల్ మినిస్టర్ గారు, మౌనముగా ఉండి పోయి తన సిత్తప్రజ్ఞతను చాటుకున్నారు.

ఎవ్వరు అయినా  కష్టపడి వాళ్ళు అనుకున్నది సాధించినప్పుడు  వాళ్ళని వెన్ను తట్టి అభినందించక పోయిన పర్వాలేదు, ఎందుకంటే వాళ్ళు అభినందనల కోసము ఎదురు చూసే వారే అయితే ఇంత వరకు వచ్చే వాళ్లే కారు, కనీసము వాళ్ళ మనసు కష్ట పెట్టకుండా, వాళ్ళ పనిని వాళ్ళని చేసుకొనిద్దాము, అప్పుడే మన పిల్లలకి కొత్త రోల్ మోడల్సు కనిపించేది. అప్పుడే మన పిల్లలిని క్రొంగొత్త లక్ష్యాల్ని మనము చూపించగలిగేది.  ప్రతి ఒక్కరిని తక్కువ చేసి చూపిస్తూ ఉంటే మన వాళ్ళని మనమే ఎదగకుండా ఆపేసిన వాళ్ళము అవుతాము. అప్పుడు మనము ఎక్కడ వేసిన గొంగళి పురుగులుగానే అక్కడే మిగిలిపోతామే తప్ప, పైకి ఎగిరే సీతాకోక చిలకలు కాలేము.

 

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s