ఈ ఆషాడములో ఆకాశములో వచ్చే పండగల వెల్లువ!!!

ప్రజ్వలించే భానుడి భగ భగల నుండి ఉపశమనము కలిగించేందుకు వరుణ దేవుడు పరుగున వచ్చే మాసం ఆషాడమే. చిరు జల్లులు, కారు మబ్బులతో, చల్లని గాలులతో అలరించేది కూడా ఆషాడమే. తోలి పండుగ అయినా వినాయక చవితితో ముందు ఉంది పండగల కాలము అని గుర్తుకు తెచ్చేది కూడా ఆషాడమే. కానీ ఈ సారి, ఆషాడము మన భూమి మీదే కాకుండా ఆకాశములో కూడా పండగల వెల్లువ తెస్తోంది. అవి ఏమిటో తెలుసుకుందామా?

1 ) సూర్య గ్రహణము:

అంతరిక్ష వీక్షకులకు పెద్ద పండుగ సూర్య గ్రహణము. అందరు ఏంతో ఆసక్తితో ఎదురు చూసే, ఎంతో జాగ్రతలు తీసుకోని చూసే పండుగ ఇదే మరి.  ఈ జులై పదమూడో తారీఖున (13th ) తెల్లవారుజామున జరిగింది. ఆకాశము అంత ఎర్రపు రంగు లోంచి కారు చీకటిలోకి మారే ఆ అద్భుత క్షణాలు వీక్షించే అదృష్టాన్ని మనకి లేక పోయింది. కానీ ఆ అదృష్టాన్ని కొంచెముగా సొంతము చేసుకున్నది ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, తాస్మానియా వాసులు మాత్రమే. వాళ్ళకి కూడా సంపూర్ణ గ్రహణము వీక్షించే అదృష్టము లేక పోయింది. ఈ గ్రహణము మన కాలమానము ప్రకారము  07:18 AM IST కి మొదలు అయి, 08:31 AM కి పూర్తి అవుతోంది. ఎక్కువగా ఈ గ్రహణము అంటార్కిటా కి ఆస్ట్రేలియా కి మధ్యలోని సముద్ర జలాల మీదే కనిపిస్తుంది. అక్కడ శీతాకాలం కావటముతో సూర్యుడు ఇంకా పూర్తిగా ఉదయించటానికి ముందే ముగిసి పోతుంది.

రెండో సూర్య గ్రహణము ఆగష్టు 11 న  కనిపిస్తుంది. కానీ ఈ సారి భూమికి తూర్పు భాగాన కనిపిస్తుంది. నార్త్ పోల్ లో, తూర్పు ఐరోపాలో, తూర్పు ఆసియా లో కనిపిస్తుంది.

Image Credit: Nasa.gov

2 ) చంద్ర గ్రహణము:

సూర్య గ్రహణము తరువాత రెండో పెద్ద పండుగ మరి చంద్ర గ్రహణమే కదా. అందులో అందరికి ఎంతో హాయి నిచ్చే చందమామకి వచ్చే పండుగని ఎవరు వదులుకుంటారు చెప్పండి. ఏ జాగ్రతలు లేకుండా మన ఇంటి దగ్గర నుంచే ఎంతో హాయిగా చూసే పండుగ మరి ఇది. జులై 27 తారీఖున అర్ద రాత్రి, తెల్లవారితే 28 అనగా మనకి సంపూర్ణ చంద్ర గ్రహణము కనిపిస్తుంది. దాదాపు  నాలుగు గంటలు పాటు జరిగే పెద్ద పండుగ ఇది. 27th రాత్రి  11:54 PM IST  మొదలు అయ్యి, 28  తెల్లవారుజామున  03:49 AM IST కి ముగుస్తుంది. గత వంద సంవత్సరాలలో ఇది రెండో పెద్ద చంద్ర గ్రహణము.  మన భారతావనిలో అని చోట్ల నుంచి చక్కగా కనిపిస్తుంది. ఈ చంద్ర గ్రహణాన్ని “బ్లడ్ మూన్ – చంద్ర గ్రహణము” అని కూడా పిలుస్తారు, ఎందుకు అంటే చంద్రుడు మనకి ఎర్ర రంగులో కనిపిస్తాడు కాబట్టి. ఎరుపు రంగులో ఎందుకు ఉంటాడు అంటే, ఈ నెలలో చంద్రుడు భూమికి దగ్గరగా ఉంటాడు. దానితో సూర్యుడి కిరణాలూ భూమి కిందనుంచి కూడా చంద్రుడి మీద పడుతూ ఉంటాయి..అందుకే మనకి ఎఱుపు రంగులో పెద్దగా కూడా కనిపిస్తాడు.  అందుకే ఈ గ్రహణము మనకి ఒక్క అతి పెద్ద వర్ణాల పండుగని తీసుకు వస్తోంది. మొన్న జన్యువరిలో జరిగిన చంద్ర గ్రహణములాగా. కాకపోతే పోయిన సారి లాగే ఈ సారి కూడా వరుణుడు తన మేఘాలతో మనలిని ఏడిపించకుండా ఉంటే అతి పెద్ద చంద్ర గ్రహణం సంపూర్ణముగా వీక్షించే అదృష్టము మనకి దక్కుతుంది.

3 ) అంగారక దర్శనము:

ఈ జులై లో ఇంకో విశేషము ఏమిటిరా అంటే, అంగారకుడు మనకి అతి దగ్గరగా వస్తున్నాడు. మన ఇంటి దగ్గర నుంచే కూడా చూసే ఆవకాశము ఇస్తున్నాడు. జులై 31st భూమికి అతి దగ్గరగా వస్తున్నాడు. ఈ నెల మూడో వారము నుంచి సాయము సంధ్య తరువాత, మనకి ఎర్రగా పెద్దగా కనిపిస్తాడు. చంద్ర గ్రహణము సమయములో చంద్రుడిపక్కనే కనిపిస్తాడు.  పోయిన సారి ఇంత దగ్గరగా మనకి ఆగస్టు 2003 లో కనిపించాడు. ఆ తరువాత, ఆ అంగారకుడికి మన మీద దయ కలిగింది ఇప్పుడే మరి.  మళ్ళీ మనకి ఇంకో 60 ఏళ్ళ వరకు కనిపించడు. ఈ లోపల కావాలి అంటే మనము ఏ ప్లానిటోరియం లోకి వెళ్లి టెలీస్కోప్ సహాయము తీసుకోవాల్సిందే మరీ.

ఈ పండగలని మీ పిల్లలికీ కూడా చూపించి వాళ్లకి ఆకాశములో జరిగే వింతలని తప్పకుండా పరిచయము చేయండి. ఈ దేవుడి సృష్టిలోని అద్భుతాల్ని వాళ్ళకి పరిచయము చేయండి.

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s